కరోనా.. అనాథ పిల్లలకు కేంద్రం భరోసా.. ఉచిత విద్య, బీమా!

by Shamantha N |
Narendra Modi address International Day of Yoga
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. వారికి ఉచిత విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పీఎం కేర్స్ నిధుల ద్వారా అనాథలైన పిల్లలకు ఉచిత విద్యతో పాటు 18ఏళ్లు నిండిన అనాథలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పై నెలనెలా స్టై ఫండ్ ఇస్తామన్నారు.

23 ఏళ్లు వచ్చేంతవరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పై స్టైఫండ్ ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందజేయనున్నారు. అనాథ పిల్లల ఉన్నత విద్యకు విద్యారుణం ఇప్పించడంతో పాటు దానికి వడ్డీని కేంద్రమే భరించనుంది.

Advertisement

Next Story

Most Viewed