బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

by Shyam |
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
X

దిశ, కోదాడ: 14 ఏళ్ల ఓ మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్నారు చైల్డ్ లైన్ అధికారులు. ఈ ఘటన కాపుగల్లు గ్రామంలో చోటుచేసుకుంది. మైనర్ బాలికకు వివాహం చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఐసీడీఎస్, చైల్డ్ లైన్ అధికారులు గ్రామంలోని బాలిక ఇంటికి వెళ్లారు. బాల్య వివాహం చేయడం వల్ల వచ్చే అనర్థాలను అమ్మాయి తల్లిదండ్రులకు వివరించారు. 18 ఏళ్లు నిండిన తరువాతనే బాలికకు వివాహాం చేయాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించడంతో పెళ్లి నిలుపుదలకు బాలిక తల్లిదండ్రులు అంగీకరించారు.

Advertisement

Next Story