- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తల్లిని కోల్పోయి అనాథగా మారిన చిన్నారి
దిశ ప్రతినిధి, కరీంనగర్: భూతవైద్యం వికటించి తన తల్లి చనిపోవడంతో రెండు నెలల ఓ చిన్నారి అనాథగా మారింది. కాగా, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రజిత ప్రేమ వివాహం చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మల్లేశ్ ను పెళ్లి చేసుకుని మెట్టినింట అడుగు పెట్టింది.
తల్లిదండ్రులు లేకున్నా డిగ్రీ వరకూ చదివి హైదరాబాద్ లో ఉపాధి పొందుతున్న రజితకు మల్లేష్ పరిచయం కావడంతో అతడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. దీంతో ఆమె భర్త మంచిర్యాల, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. కానీ, ఆమె ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆమె చిన్నాన్న వరుస అయ్యే రవి అనే వ్యక్తి జమ్మికుంటకు చెందిన శ్యాం అనే భూత వైద్యుడిని కుందారం తీసుకెళ్లి వైద్యం చేయించాడు. భూత వైద్యుడు శ్యాం ఆమెను చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె మంచంపై పడిపోగా ఆమె తల వెనక భాగంలో బలమైన గాయమైంది.
దీంతో రజితను కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం మరణించింది. రెండు నెలల పసికందు ఉన్నదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా భూత వైద్యుడు ఇష్టం వచ్చినట్టు రజితను చిత్రహింసలకు గురి చేయడం వల్లే మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి ఒడిలో ఒదిగి పడుకోవల్సిన పసికందు వారం రోజులుగా తల్లి స్పర్శకు నోచుకోలేదు సరికదా ఇప్పుడు శాశ్వతంగా అమ్మను కొల్పోయింది. తల్లి స్పర్శ తన్మయత్వంలో నిద్రపోవాల్సిన ఆ చిన్నారి తల్లిలేని అనాథగా మారడం అందరిని కలిచివేస్తోంది.