కుషాయి గూడలో దారుణం..

by Shyam |
కుషాయి గూడలో దారుణం..
X

దిశ ప్రతినిధి,మేడ్చల్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. కుషాయిగూడలోని శుభోదయ నగర్ కల్వర్టు వద్ద నాళాలో రెండు నెలల పసికందు మృతదేహం కనిపించింది. మృతదేహం కొట్టుకుపోవడాన్ని స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దుండగులు పసికందును హత్యచేసి పడేశారా లేక కావాలనే పడేశారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story