యాదాద్రిలో పదివేల మంది రుత్వికులతో సుదర్శన యాగం

by Shyam |
యాదాద్రిలో పదివేల మంది రుత్వికులతో సుదర్శన యాగం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్‌:నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం కేసీఆర్‌కు తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… ఆలయ ప్రారంభం రోజున 10వేల మంది రుత్వికులతో సుదర్శన యాగం చేస్తామని అన్నారు. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో యాగం చేయడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం, చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత పెట్టారు. అనంతరం వీవీఐపీ గెస్ట్ హౌజ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు.

Advertisement

Next Story