- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chetan Bhagat:చిన్నారి మిస్సింగ్.. ఆ 400 రోజులు ఏం జరిగిందో చెప్తానంటున్న రైటర్
దిశ, సినిమా : యూత్‌ను మెప్పించే రచనలతో సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఇండియన్ రైటర్ చేతన్ భగత్.. మరో కొత్త బుక్ అనౌన్స్ చేశాడు. ‘టూ స్టేట్స్, ఫైవ్ పాయింట్ సమ్‌వన్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, వన్ నైట్@ ది కాల్ సెంటర్’ వంటి నావెల్స్‌తో ఫేమ్ సంపాదించిన చేతన్.. ప్రముఖ ఇంగ్లీష్ డైలీస్ లో యూత్, నేషనల్ ఇష్యూస్‌పై రాసిన కాలమ్స్‌తోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బాలీవుడ్ లో వచ్చిన ‘3 ఇడియట్స్, టూ స్టేట్స్, కై పో చే, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ వంటి సినిమాలు తన బ్లాక్ బస్టర్ నవలల ఆధారంగా తెరకెక్కినవే.
తన నుంచి చివరగా 2019లో రిలీజైన ‘ఇండియా పాజిటివ్ : న్యూ ఎస్సే’ బుక్‌లో రామ్ మందిర్ నుంచి రోహింగ్యాల వరకు అనేక సమస్యలపై చర్చించిన చేతన్.. ప్రస్తుతం ‘400 డేస్’ పేరుతో న్యూ బుక్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ నెల 21న కవర్ పేజీని విడుదల చేస్తున్నామని, అమెజాన్ వంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చని ప్రకటించాడు. లాక్‌డౌన్ టైమ్‌లో రాసిన ఈ బుక్‌ను వెరీ వెరీ స్పెషల్‌గా పేర్కొన్న రైటర్.. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ అని తెలిపాడు. మిస్సింగ్ చైల్డ్ నేపథ్యంతో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుందన్నాడు. ఇది తనతో పాటు బుక్స్‌కు ఆదరణ పెంచేందుకు హెల్ప్ చేస్తుందని, మరోసారి ఇండియాలో నవలల పట్ల రీడర్స్ ఎగ్జైట్‌మెంట్ చూస్తుంటే ఆనందంగా ఉందని వెల్లడించాడు.
My new book title: 400 Days! #Staytuned pic.twitter.com/4fRpmKo2Ml
— Chetan Bhagat (@chetan_bhagat) September 18, 2021