- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CSK ఖాతాలో మరో గెలుపు.. రాయల్స్ ఓటమి
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 12వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 45 పరుగుల తేడాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు పారేసుకున్నారు. ఓపెనర్ జోస్ బట్లర్ (49) పరుగులతో రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగారు.
మనన్ వోహ్ర (14), సంజు శాంసన్ (1), శివం దూబే (17), మిల్లర్ (2), రియాన్ పరాగ్ (3), క్రిస్ మోరిస్ (0) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. దీంతో 95 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లు కోల్పోంది. అదే సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా (20), జయదేవ్ ఉనాద్కట్(24) పరుగులు చేశారు. ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన చేతన్ సకారియా (0), ముస్తాఫిజుర్ రహ్మా్న్ (0) నాటౌట్‌గా నిలిచినా ఓవర్లు ముగిశాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు.
చెన్నై ఇన్నింగ్స్..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయినప్పటికీ 188 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (10), ఫాఫ్ డు ప్లెసిస్ (33), మొయిన్ అలీ (26), సురేశ్ రైనా (18), అంబటి రాయుడు (27), జడేజా (8), ఎంస్ ధోని (18), సామ్ కర్రన్(13 ), బ్రావో( 20 నాటౌట్ ), శార్దుల్ ఠాకూర్ (1), దీపక్ చాహర్ (0 నాటౌట్ )పరుగులు చేశారు. సీఎస్కే జట్టులో సమ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్‌లు మాత్రమే రనౌట్ అవ్వగా.. మిగతా బ్యాట్స్‌మెన్లు అందరూ క్యాచ్ అవుట్ కావడం విశేషం. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేతన్ సకారియా 3, క్రిస్ మోరిస్ 2, ముస్తాఫిజుర్ రహ్మాన్, రాహుల్ తెవాటియా తల ఒక వికెట్ తీసుకున్నారు.