బ్రేకింగ్.. చంద్రబాబు సంచలన నిర్ణయం

by Anukaran |
chandrababu
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ జీవితంలో సభల్లో ఎన్నో చర్చలు చూశాం కానీ.. ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనని వ్యక్తిగతంగా దూషించారని, కుటుంబాన్ని రోడ్డుమీదకు లాగారని బాబు ఆరోపించారు.

తాను ఎన్నడూ లేని విధంగా అవమానాలు భరించానని అన్నారు. కుప్పం ఫలితం తర్వాత.. సీఎం జగన్ తన ముఖం చూడాలని ఉంది అన్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించారు. తన కుటుంబ సభ్యుల గురించి సభలో ప్రస్తావన తీసుకువచ్చారని బాధపడినట్టు చంద్రబాబు తెలిపారు. ఇక మళ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాకే సభకు వస్తానని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు.

Next Story

Most Viewed