చంద్రబాబు నోరు విప్పడం లేదు: విజయసాయిరెడ్డి

by srinivas |

టీడీపీకి సంబంధించిన నేతలతో పాటు చంద్రబాబు మాజీ పీఏపై ఇటీవల ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇవాళ ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. మాజీ పీఏతో పాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరు విప్పడం లేదనీ, ఈ సోదాలపై రెండు రోజులుగా చంద్రబాబు కిక్కురుమనకుండా ఉన్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కియా కంపెనీ లేచిపోతోందంటూ ఫేక్ వార్తలు సృష్టించారంటూ ఆరోపించారు.

Advertisement

Next Story