రంగంలోకి ఆ ముఠాలు… అప్రమత్తంగా ఉండండి

by Sridhar Babu |
రంగంలోకి ఆ ముఠాలు… అప్రమత్తంగా ఉండండి
X

దిశ ప్రతినిది, కరీంనగర్: కరీంనగర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ గ్యాంగ్ లు రంగంలోకి దిగాయి. అంతరాష్ట్ర ముఠాగా భావిస్తున్న వీరు ఒంటరి మహిళలే టార్గెట్ గా బంగారు ఆభరణాలు ఎత్తుకెళుతున్నారు. కరీంనగర్ లోని వివిధ కాలనీలతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ఘటనలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో పోలీసులు వేట మొదలు పెట్టారు. ఓ వైపున సోషల్ మీడియా వేదికగా చోరీకి పాల్పడుతున్న మఠాల గురించి ప్రచారం చేస్తూనే మరో వైపున చైన్ స్నాచింగ్ గ్యాంగ్ ల కోసం ఆరా తీస్తున్నారు. స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేసి గ్యాంగ్ ల గురించి ఆరా తీస్తున్నాయి.

సీసీ కెమెరాలకు చిక్కకుండా..

నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు దొంగలు. ముఖం కనపడకుండా బైక్ లపై తిరుగుతూ స్నాచింగ్ చేస్తున్నారు. బైక్ నెంబర్లు కూడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ముఠాలు తమ పనిని సాఫీగా చేసుకుని పోతున్నాయి. వృద్దులని చూడకుండాకూడా చోరీలకు పాల్పడుతున్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తిమ్మాపూర్ మండలంలో వ్యవసాయ పనులకు వెలుతున్న ఒంటరి మహిళను గమనించిన దొంగలు ఆమె మెడలోని చైన్ లాక్కుని పరార్ అయ్యారు. వాకింగ్, షాపింగ్ ఇలా ఏ పనికి వెల్లినా మహిళలు అలెర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి తయారైంది. అనుమానస్పద వ్యక్తులు కనిపించినా, బైక్ లపై సమీపంలోకి వచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story