ఆ జీవోను రద్దు చేయాలి: చాడ వెంకట్ రెడ్డి

by Ramesh Goud |
Chada Venkat Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీవో 60ను రద్దు చేసి, పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బేసిక్ వేతనం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. గత పీఆర్సీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు తీరని అన్యాయం జరిగిందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తక్కువ వేతనాలు ఇవ్వడం, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, కోర్టులు జోక్యం చేసుకొని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వివరించారు. పర్మినెంట్ ఉద్యోగికి రూ. 19,500 బేసిక్ వేతనం ఉంటే అదే విభాగంలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీఓ60 ప్రకారం అదే జీతం ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేసేది ఎక్కువగా బడుగు, బలహీన వర్గాలకు చెందినవారేనని, నూతన పీఆర్సీని అమలు చేయాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed