ట్విట్టర్‌కు చివరి అవకాశమిచ్చాం.. ఆ పని చేసింది నేను కాదు

by Shamantha N |
ravi-shanker-prasad 1
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ యాక్ట్ రూల్స్‌ను ట్విట్టర్ పాటించడం లేదనే కారణంతో ఇంటర్మీడియరీ హోదాను భారత ప్రభుత్వం తొలగించింది. దీనిపై తాజాగా కేంద్ర టెలికాం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ట్విట్టర్ కంపెనీకి చివరి అవకాశం ఇచ్చినా పద్ధతి మార్చుకోలేదని.. మే 26తో మూడు నెలలు గడువు ముగిసినందున ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు.

ఆ కంపెనీకి ఇంటర్మీడియరీ హోదా తొలగించింది తాను కాదని, చట్టమే ఆ పని చేసిందని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. దేశంలో ట్విట్టర్ మినహా మిగతా సామాజిక మాద్యమాలకు చెందిన యాజమానులు అందరూ నిబంధనలు పాటిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ముగ్గురు అధికారుల్ని నియమించడానికి ట్విట్టర్‌కు మూడు నెలల గడువిచ్చామని, కేంద్రం ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే చట్టం తన పని తాను చేసుకుపోయిందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed