ఈటలను జైల్లో పెట్టినా.. గెలిపించుకుంటాం : కిషన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-07-04 08:00:46.0  )
kishan-reddy 1
X

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే కేంద్రంపై లేని పోని ఆరోపణలు చేస్తుందని, తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని.. మీ చేతికిస్తేనే రాష్ట్రానికి ఇచ్చినట్లా..? అని మండిపడ్డారు. కరోనా సమయంలో కేంద్రం ఏమి చేసిందో అందరికీ తెలుసునని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలన్నారు.

కొత్తగా కృష్ణా వాటర్ వైఫల్యాన్ని టీఆర్ఎస్ కేంద్రంపై వేస్తోందని, దావత్‌లు చేసుకున్నప్పుడు, ఆస్తులు పంచుకున్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని.. ఆయన్ను అక్రమంగా జైల్లో పెట్టినా.. హుజురాబాద్‌లో ఈటలను గెలిపించకుంటామని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.

Advertisement

Next Story