- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే గనుక జరిగితే.. 2023లో తెలంగాణలో భాజపా సర్కార్
దిశ, కరీంనగర్ సిటీ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో బూత్ లెవల్ స్థాయికి చేరితే 2023లో తెలంగాణలో భాజపా సర్కార్ పాలన సాగించటం తధ్యమని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భాగవంత్ కూబా అన్నారు. ఇటీవల పునర్వ్యవస్థీకరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌లో కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషిచేయాలని, ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు శ్రీరామ రక్షగా మారుతున్నాయని అన్నారు.
పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇతర పార్టీల కార్యకర్తలను కూడా యాత్రలో పాల్గొనేలా బూత్ స్థాయిలో ప్రోత్సహించాలన్నారు. అభివృద్ధి పట్ల ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉందని, రైతుల కోసం ఖాయిలా పడ్డ ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిపించి రూ.6,300కోట్ల పైచిలుకు మొత్తం ఖర్చు చేసి పునఃప్రారంభించారని అన్నారు. అంతకుముందు మానేరు బ్రిడ్జి సమీపంలో కేంద్ర సహాయమంత్రికి బీజేపీ కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.