- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ తొక్క తీస్తాం: ఓటీటీ, సోషల్ మీడియాపై కేంద్రం విధించిన కొత్త రూల్స్ ఇవే
దిశ,వెబ్‌డెస్క్: ఓటీటీ, సోషల్ మీడియాపై కేంద్రం కొరడా ఝులిపించింది. అశ్లీల, అసభ్యకర కంటెంట్ నిషేధానికి చర్యలు చేపట్టింది. ఫేక్ న్యూస్ కట్టడికి చర్యలు తీసుకుంది. అంతేకాదు ఓటీటీతో పాటు సోషల్ మీడియాలో విడుదలయ్యే సినిమాలపై ఆంక్షలు విధించింది కేంద్ర సర్కార్. వాటికి సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఆ గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి.
♦వీదేశీ సోషల్ మీడియా సంస్థలు భారత్ లో తమ కార్యాలయాల్ని ప్రారంభించాలని ఆదేశించారు. తద్వారా ఫేక్ న్యూస్‌ను, అసభ్య కంటెంట్ పై వచ్చే సమస్యల్ని సులభంగా పరిష్కరించడంతోపాటు వాటిని తొలగించవచ్చని కేంద్రం మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ మీడియాకి తెలిపారు.
♦సోషల్ మీడియా సైట్లలో ఏదైనా ఒక వివాదానికి సంబంధించిన అంశంపై పూర్తిగా క్లారిటీ ఇవ్వాలని సూచించారు. ఉదాహరణకు ఓ యువకుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తే.. ఆ యువకుడు న్యూసెన్స్ ఎందుకు క్రియేట్ చేశాడు? సంబంధిత వివరాల్ని ముందుగానే బహిర్గతం చేయాలన్నారు. ఒకే వేళ అదే అంశంపై అసత్య ప్రచారం చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు.
♦ కేంద్రం విధించిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, గృహ, ఐ అండ్ బి, లా, ఐటి, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కూడిన కమిటీ సభ్యులు విచారణకు ఆదేశించే అధికారం ఉంటుంది. సుమోటో కేసుగా నమోదు చేయించవచ్చు.
♦చట్టాన్ని ఉల్లంఘించిన కంటెంట్ ఉంటే.., ఆ కంటెంట్‌ను బ్లాక్ చేసేలా లేదంటే సంబంధిత కమిటీ సభ్యులకు చేరవేసేలా జాయింట్ సెక్రటరీ లేదా ఆథరైజ్డ్ అధికారిని ప్రభుత్వం నియమిస్తున్నట్లు తెలిపారు.
♦వయస్సును బట్టి ఓటీటీ సంస్థలకు కంటెంట్ ను అందించాలని కేంద్రం ఆదేశించింది. వివిధ వయస్సుల వారిని ఐదు విభాగాలుగా విభజించింది. విభజించిన విధంగా ఆ కంటెంట్ మాత్రమే అందించాలని లేదంటే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
1. అన్ని వయస్సుల వారు చూసే యూనివర్సల్ వీడియోలు
2. ఏడేళ్లలోపు
3. 13ఏళ్లలోపు
4. 16ఏళ్లలోపు
5. పెద్దవాళ్లు చూసేవి
♦డిజిటల్ న్యూస్ మీడియా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమాల్ని ఫాలో అవ్వాలి. కొత్త వెబ్‌సైట్స్ నిర్వాహకులు సంబంధిత వివరాలను ప్రసార మంత్రిత్వ శాఖ సైట్‌లో నమోదు చేయాలి.
♦అశ్లీల కంటెంట్ తో పాటు అపకీర్తి, అవమానకరమైన, జాత్యహంకార, మైనర్లకు హాని కలిగించే సోషల్ మీడియా కంటెంట్‌ను నిషేధించినట్లు కేంద్రం తెలిపింది. తద్వారా భారతదేశం ఐక్యత, సమగ్రత, రక్షణ, భద్రత లేదా సార్వభౌమత్వం ఇతర దేశాలతో దాని సంబంధాలు మెరుగుపడతాయి. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన 36 గంటలలోపు సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ను తొలగించాలి.
♦ ఏదైనా కంటెంట్ పై ఫిర్యాదు వస్తే.., ఆ కంటెంట్ ను 24గంటల్లోపు సంబంధిత ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ లు ఈ కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేశారు.