విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక నిర్ణయం

by srinivas |   ( Updated:2021-03-08 06:44:15.0  )
Nirmala
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని తేల్చి చెప్పింది. స్టీల్ ప్లాంట్ లో 100% పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. మెరుగైన ఉత్పాదకత కోసమే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రైవేటీకరణ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు.

ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మల సీతారామన్ లేఖ రూపంలో సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్‍లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలియజేశారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు నిర్మలా సీతారామన్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story