సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

by  |   ( Updated:2020-08-23 02:42:58.0  )
సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌‌డెస్క్: సినిమా, టీవీ సీరియల్ షూటింగ్స్‌కు ఎట్టకేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సినిమా షూటింగ్స్‌కు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు అనుసరించి షూటింగ్స్ జరుపుకోవాలని పేర్కొంది.

మార్గదర్శకాలు

షూటింగ్స్ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి
సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలి
నటీనటులు అందరూ ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించాలి
షూటింగ్స్ జరిగే సమయంలో ఇతరులకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదు
మేకప్ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి
వీలైనంత తక్కువ సిబ్బందితో షూటింగ్స్ జరిపేలా చర్యలు తీసుకోవాలి
థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ అమలు చేస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలి

ఈ మేరకు కేంద్ర సమాచారం ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేరు మీద మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.

Advertisement

Next Story