- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌కు కేంద్రం షాక్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. సునీల్ కుమార్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు కేంద్రం హోంశాఖ లేఖ రాసింది. కాగా, ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్‌పై ఆయన భార్య గృహహింస కేసు పెట్టిందని.. దీనికి సంబంధించి చార్జీషీటు కూడా దాఖలైనట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయనను ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ చేయాలని లేఖలో కోరారు.
అలాగే సునీల్ కుమార్ తన భార్యకు తెలియకుండా ఆమె ల్యాప్ టాప్ ఓపెన్ చేసి మెసేజ్‌లు.. ఫోటోలు తీసుకునేవారని ఈ విషయం చార్జీషీట్‌లో ఉందని తెలిపారు. ఆ విధంగానే తన సెల్‌ఫోన్ నుంచి ఇతరులకు మెసేజ్‌లు పంపారని కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ రఘురామ ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు సోమవారం లేఖ రాసింది. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ప్రతిని సీఎస్‌కు పంపింది. లేఖలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.