- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డ హీరోయిన్
దిశ, సినిమా: హీరోయిన్ సెలీనా జైట్లీ మదర్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది. రెండు సార్లు ట్విన్స్‌ను పొందడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఏడు లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలాంటి అదృష్టం వరిస్తుందని డాక్టర్ చెప్పగానే.. తన భర్త పీటర్ ముఖంలో కనిపించిన ఆనందం ఇప్పటికీ గుర్తుందని చెప్పింది. ఈ సందర్భంగా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ టైమ్ పిక్స్ షేర్ చేసిన సెలీనా.. ఆ సమయంలో టఫ్ జర్నీని ఫేస్ చేసినట్లు వివరించింది.
ట్విన్ బేబీ హార్మోన్స్ కారణంగా రెండుసార్లు కూడా గర్భధారణ మధుమేహంతో బాధపడ్డానని, కఠినమైన డైట్ ఫాలో కావాల్సి వచ్చిందని చెప్పింది. రెండో గర్భం సమయంలో తండ్రిని కోల్పోయిన షాక్ కారణంగా నడిచే సామర్థ్యం కోల్పోయానని, భర్త పీటర్ వీల్ చెయిర్‌తో నెట్టాల్సి వచ్చేదని వివరించింది. ఈ క్రమంలో బోన్స్ ఎఫెక్ట్ అయ్యాయన్న సెలీనా.. గర్భంలో పిల్లలు తిరిగినప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండేదని వెల్లడించింది. అయితే అంత కష్టపడినా ‘బేబీ షంషేర్‌ను కోల్పోవడం, మరో బేబీ అర్థుర్ జాగ్‌ను మూడు నెలలు ఇంక్యుబేటర్‌లో ఉంచడం, అదే టైమ్‌లో తన తల్లి చనిపోవడం’.. వీటన్నిటిని ఒకే సారి ఫేస్ చేస్తున్న క్రమంలో మాతృత్వం ఎంత గొప్పదో అర్థమైందని తెలిపింది సెలీనా. అంతటి సామర్థ్యం తనలో ఉందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది.
పదాతిదళ అధికారి భార్యగా తన తల్లి డాక్టర్ మీతా జైట్లీ చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న సెలీనా, మాతృత్వానికి లింగ భేదం లేదని తెలిపింది. ఒక బిడ్డ ఎదగడానికి ధైర్యం, శక్తి, ప్రేమను ఎలా అందిస్తారో అమ్మను చూస్తే అర్థమైందని.. ఇలాంటి శక్తిని అనుభవించే అవకాశం తనకు వచ్చినందుకు కృతజ్ఞతగా భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రేమ, పెంపకం, సంరక్షణ కోసం ప్రతిజ్ఞ చేసే ప్రతీ ఒక్కరికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.