నిజమైన హీరోయిజం మీదే : పూరి

by Shyam |
నిజమైన హీరోయిజం మీదే : పూరి
X

వెండితెర మేరుశిఖరం అమితాబ్ బచ్చన్ 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఎనిమిది పదుల వయసుకు దగ్గర పడుతున్నా.. నేటీకి తనను తాను మెరుగుపర్చుకుంటూ, సినిమానే శ్వాసగా బతుకుతున్నారు బచ్చన్ జీ. ఇప్పటికీ చాలెంజింగ్ పాత్రలు పోషిస్తూ.. యువతరానికి స్ఫూర్తినిస్తున్న ఆ నట శిఖరానికి అశేష అభిమానులు, సెలెబ్రిటీలు, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

‘నా ప్రియ‌మైన పెద్ద‌న్న‌, ఇండియ‌న్ సినిమాకు బిగ్ బీ, టాలెంటెడ్ ప‌వ‌ర్ హౌస్, నా మార్గ‌ద‌ర్శ‌కులు.. వ‌న్ అండ్ ఓన్లీ వ‌న్ అమితాబ్ బ‌చ్చ‌న్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. ఇలానే ఉత్తేజ‌ప‌రుస్తూ మ‌రెన్నో పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని, మా అందరిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాను’ – చిరంజీవి

మీ సినిమాలు చూస్తూ థియేటర్‌లో ఎన్నిసార్లు ఈలలు వేశానో మీకు తెలియదు సర్. నిజమైన హీరోయిజం అంటే మీదే.. లవ్ యూ సర్. హ్యాపీ బర్త్ డే – పూరి

‘మెనీ మోర్ హ్యపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లెజెండరీ అమితాబ్ సర్. మమ్మల్ని ఇన్‌స్పైర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు’ – ప్రభాస్

‘నా ప్రియమైన అమిత్ అంకుల్.. మీరు ఆయురారోగ్యాలు, సు:ఖ శాంతులతో హ్యాపీగా ఉండాలి. నాలానే ఎన్నో లక్షలమందిని ఇన్‌స్పైర్ చేయాలి. హ్యాపీ బర్త్ డే’ – హృతిక్ రోషన్

‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమిత్ జీ. మరింత కాలం ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటున్నాను’ – అజయ్ దేవగణ్

‘లివింగ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీరు నాకే కాదు, ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న మిలియ‌న్ల ప్రేక్ష‌కుల‌కు ప్రేర‌ణ‌. ఎల్ల‌ప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను’ – మ‌హేశ్ బాబు

రాంచరణ్, కత్రినాకైఫ్, అనుష్క శర్మ, ఫర్హాన్ అక్తర్, పరిణితీ చోప్రా, రితేష్ దేశ్‌ముఖ్, నేహా ధూపియా, మెహరీన్, బాబీ, ఛార్మీ, ఆయుష్మాన్ ఖురానా.. ఇలా ఎంతోమంది సెలెబ్రిటీలు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. కాగా, ప్రస్తుతం అమితాబ్.. ఝండ్, బ్రహ్మాస్త్ర, చెహ్రేతో పాటు.. ప్రభాస్ సినిమాలోనూ నటిస్తున్నారు. మ‌రోవైపు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 12’ రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని కూడా అలరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed