కలిసినప్పుడల్లా అనుష్క కాళ్లు మొక్కుతాం!

by Shyam |
కలిసినప్పుడల్లా అనుష్క కాళ్లు మొక్కుతాం!
X

స్వీటీ(అనుష్క శెట్టి) చాలా స్వీట్… స్వీటీ చాలాహాట్ ఇది ప్రేక్షకులు, అభిమానులు చెప్పేమాట. కానీ, స్వీటీ చాలా స్వీటెస్ట్ అంటుంటారు తనను దగ్గరగా చూసినవాళ్లు. అందంలో మేటి అనిపించుకున్న స్వీటి… గుణంలో తనకు తానే సాటి అని చెబుతుంటారు. సూపర్ సినిమాతో సూపర్ ఎంట్రీ ఇచ్చిన స్వీటీ… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో వైవిధ్యమైన కథలతో మెప్పించిన స్వీటీ .. దక్షిణాది సినీ పరిశ్రమలో అందరి ఫేవరేట్ అయిపోయింది. స్వీటీ సినిమా రంగానికి పరిచయమై 15 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా స్వీటీ గురించి ప్రముఖుల మాటల్లో…

తొలి సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్

స్వీటీని బంగారుతల్లి అంటుంటారు పూరి. ముంబైలోని సీ ప్రిన్సెస్ హోటల్‌లో ఈ బంగారం దొరికిందని… యాక్టింగ్, డ్యాన్స్ గురించి అసలు ఓనమాలు కూడా తెలియని స్వీటీ… ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదగడం గర్వంగా ఉందన్నారు. యోగా టీచర్ అయిన తనను చూసిన వెంటనే బాగుందని అనుకున్నా… యాక్టింగ్ స్కిల్స్ లేకపోవడంతో ఓ ఆరు నెలలు తనతో హైదరాబాద్ తీసుకువచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ యాక్టింగ్ నేర్చుకోవాలని సూచించానని తెలిపాడు. వినోద్ బాల దగ్గర నటనాభ్యాసం చేసిందని చెప్పాడు. సూపర్ సినిమా కోసమే తనను సెలక్ట్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చానని… ఈ అమ్మాయిని చూడగానే హీరో నాగార్జున భలే ఉందే అమ్మాయి అన్నారని చెప్పాడు. ఆడిషన్ చెద్దామన్నా కూడా అవసరం లేదు హీరోయిన్‌గా ఫిక్స్ చేయండని చెప్పారట నాగ్. స్వీటీ పేరు అనుష్కగా నామకరణం జరిగింది కూడా సూపర్ సినిమా సెట్‌లోనేనని తెలిపారు పూరి. సూపర్‌తో సూపర్ జర్నీని స్టార్ట్ చేసిన అనుష్క శెట్టి .. నిశ్శబ్దం సినిమా వరకు అమేజింగ్ సినిమాలు చేసిందన్నారు పూరి. మంచితనం, తెలివితేటలున్న రేర్ కాంబినేషన్ అనుష్క అని… తనలోని మంచి లక్షణాలు కొన్నైనా తమకు రావాలనే ఉద్దేశంతో కలిసినప్పుడల్లా నేను, రవితేజ, ఛార్మి తన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పాడు. లేడీ సూపర్ స్టార్ అనుష్కతో లేడీ డాన్ సినిమా చేసేందుకు సిద్ధమన్న పూరి.. స్వీటీకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

బ్రేక్ ఇచ్చిన రాజమౌళి

స్వీటీ(అనుష్క) నా కుటుంబంలో ఒకరిగా మిగిలిపోయిందని తెలిపారు దర్శకధీరుడు రాజమౌళి. తన మంచితనంతో కుటుంబానికి చాలా దగ్గరైందని.. కానీ, తర్వాత తెలిసింది తన మంచితనంతో తనకు ఎవరైనా దగ్గరవుతారని, తనను అభిమానిస్తారని అన్నాడు. విక్రమార్కుడు సినిమా సమయంలో ప్రతి షాట్‌ను చేసి చూపించమనేదన్న రాజమౌళి… హీరో రవితేజతో రొమాంటిక్ సీన్స్ కూడా చూపించమని ఇబ్బందిపెట్టేది అని తెలిపాడు. అయితే యాక్టర్‌గా ఎంత గొప్పగా నటిస్తుందో.. ఒక మనిషిగా ప్రతీ ఒక్కరినీ అంతకుమించి అభిమానిస్తుందన్నాడు. అందుకే స్వీటీ అంటే నాకు చాలా గౌరవమని… నా హృదయంలో తనకు ప్రత్యేక చోటు ఉంటుందని చెప్పాడు. 15 ఏళ్ల సినీ కెరియర్‌లో ఫెంటాస్టిక్ మూవీస్ చేసిన అనుష్క శెట్టి.. భవిష్యత్తులో అంతకు మించిన విజయాలు అందుకోవాలని కోరుకున్నాడు.

భక్తురాలిగా చూపించిన దర్శకేంద్రుడు

శ్రీ రామదాసు సినిమా సమయంలో అనుష్క శెట్టిన చూసిన రాఘవేంద్ర రావు.. అప్పుడే చెప్పారట సౌత్ ఇండస్ట్రీ నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదుగుతుందని. నాగార్జున గెస్ట్ హౌజ్‌కు వెళ్లినప్పుడు ఓ హీరోయిన్‌ను చూపిస్తానని చెప్పారట నాగ్. స్వీటీ అని పిలవగానే కింద ఫ్లోర్‌లో ఉన్న స్వీటీ ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుంటే భలే ఉందే అనుకున్నారట. ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎలా వచ్చిందో… సినీ జీవితంలోనూ అలాగే ఒక్కో మెట్టు ఎదుగుతూ సూపర్ హీరోయిన్ అయిపోయిందన్నారు రాఘవేంద్ర రావు. ఫస్ట్ సినిమా ‘సూపర్‌’తో సూపర్ అనిపించిన స్వీటీకి .. కోడిరామకృష్ణ ‘అరుంధతి’ సినిమాతో గజకేసరి యోగం పట్టిందన్నారు. బాహుబలి సినిమాలో దేవసేన క్యారెక్టర్‌తో హంసవాహనం ఎక్కి ఆకాశాన్ని తాకిందని ప్రశంసించారు. ఊపిరి పీల్చుకో అన్న ఒక్క డైలాగ్‌తో సినిమా థియేటర్ దద్దరిల్లేలా చేసిందని కితాబిచ్చారు. ఈ జనరేషన్‌లో ఏ హీరోయిన్‌కు దక్కలేని అదృష్టం స్వీటీకి దక్కిందన్నారు. ప్రతీ పాత్ర కూడా తనను వెతుకుతూ వచ్చిందని… ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విభిన్నమైన పాత్రలు చేయగల నటిగా నిరూపించుకుందన్నారు. స్వీటీకి నాకు ఓ పోలిక ఉందన్న రాఘవేంద్ర రావు… నేను మౌన ముని అయితే… స్వీటీ మౌన మునికన్యగా ఎదిగిందన్నారు.

స్వీటీ గురించి కోనా వెంకట్

స్వీటీ మంచితనం గురించి పుస్తకం రాయొచ్చన్నారు కోనా వెంకట్. తనతో ప్రతీ చేసిన ప్రతీ ఒక్కరిని కుటుంబంలా మార్చేసుకునే గొప్ప క్వాలిటీ అనుష్కది అని ప్రశంసించారు. లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్స్‌ని అందరిని కలుపుకుపోయే అనుష్క.. అందరినీ సమానంగా చూస్తుందన్నారు. అందం, ప్రతిభ కలగలిసిన అనుష్క…. ప్రతీ సినిమాను తన మొదటి సినిమాగానే భావిస్తుందని తెలిపారు. ప్రతీ క్యారెక్టర్ కోసం హోమ్ వర్క్ చేస్తుందని… అవసరమైతే ట్రైనింగ్ తీసుకుంటుదని చెప్పారు. ఒక హీరోయిన్ 15 ఏళ్లు రాణించిందంటే తన టాలెంట్‌తో పాటు ఏదో స్పెషాలిటీ ఉండాలి. అదే అందరినీ తనవారు అనుకునే మనస్తత్వం. నిజంగా అనుష్క లేడీ సూపర్ స్టార్ అని మరో 15 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో తన కెరియర్‌ను కొనసాగించిన ఆశ్చర్యపోనవసం లేదన్నారు కోన… నాకు తెలియదు అనుకుంటూనే .. తెలుసుకుని చేసేయడం అనుష్క ప్రత్యేకత అని తెలిపారు.

స్వీటీని పరిచయం చేయనందుకు బాధపడిన వైవీఎస్ చౌదరి

స్వీటీని చూసినప్పుడే రూపలావణ్యాలు చక్కగా ఉన్న అందమైన అమ్మాయి అనుకున్నానని తెలిపారు వైవీఎస్ చౌదరి. ఒక హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ కావాలంటే ముందు ఓపిక ఉండాలి అన్న చౌదరి… దేవుడిచ్చిన స్వరూపంతోపాటు మంచితనం ఉండాలన్నారు. తనను వెతుక్కుంటూ వచ్చిన పాత్రలకు గౌరవం ఇచ్చిన అనుష్క… వెండితెరపై సజీవ రూపకల్పన చేసిందన్నారు. అందుకే సూపర్ స్టార్‌గా నిలిచిందని ప్రశంసించారు. ఎవరిని అనుష్క గురించి అడిగినా ముందు తన మంచితనం గురించే చెప్తారన్న చౌదరి… అనుష్క మనిషిని మనిషిలా చూస్తుందని.. అది తనలో ఉన్న గొప్ప క్వాలిటీ అని కాంప్లిమెంట్ ఇచ్చారు.

అనుష్క ఆపద్బాంధవురాలు అంటున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి

అనుష్క ప్రతీ ఒక్కరికి బంధువే అన్నారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. జార్జియాలో ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు తనను రోజు రిసీవ్ చేసుకునే డ్రైవర్ కారు ఫైనాన్స్ కట్టక లాక్కెళ్లారని… తనకు ఏకంగా కారే కొనిచ్చిందని తెలిపారు. ఇప్పుడు వారి కుటుంబం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. స్వీటీ ఇతరులు బాధ పడితే చూడలేదన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి… ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకునే అనుష్క ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

Tags: anushka, ladysuperstar, puri jagannath, s.s.rajamouli

Advertisement

Next Story

Most Viewed