జమిలి ఎన్నికలకు సిద్ధమే: సీఈసీ సునీల్ అరోరా

by Shamantha N |
జమిలి ఎన్నికలకు సిద్ధమే: సీఈసీ సునీల్ అరోరా
X

దిశ, వెబ్‌డెస్క్: జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు సీఈసీ సునీల్ అరోరా స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎన్నికలపై నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి లేదన్న సునీల్ అరోరా.. ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణ చేస్తే ఆ తర్వాత ఎన్నికలకు సీఈసీ రెడీ అవుతుందని తెలిపారు. గత మూడేళ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా సోమవారం కీలక వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో 2023లో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story