నేరాల నియంత్రణకు అవే కీలకం: డీసీపీ ప్రకాష్ రెడ్డి

by Shyam |
నేరాల నియంత్రణకు అవే కీలకం: డీసీపీ ప్రకాష్ రెడ్డి
X

దిశ, రాజేంద్రనగర్: సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు కాపు గడ్డలో టిఆర్ఎస్ నేత వేణు మాధవ రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన 40 CC కెమెరాలను శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకమని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి చేప్పారు. తెలంగాణ పోలీస్ శాఖ కూడా అన్ని ఏరియాల్లో CC కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాపార సముదాయాలు, ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 40 CC కెమెరాలు డొనేట్ చేసిన వేణు మాధవ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఏసీపీ భాస్కర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, మహిళా మండలి నాయకురాలు కమలమ్మ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed