కరోనా పరీక్షలకు సీఎంబీ సిద్ధం

by Shyam |   ( Updated:2020-03-30 23:55:19.0  )
కరోనా పరీక్షలకు సీఎంబీ సిద్ధం
X

హైదరాాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్లులార్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)‌లో మంగళవారం నుంచి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీసీఎంబీకి ఆదేశాలు అందాయి. రోజుకు 1000 పరీక్షలు చేయగల సామర్థ్యం సీసీఎంబీకి ఉంది. గాంధీ హాస్పిటల్ నుంచి నమూనాలను సీసీఎంబీకి పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Tags: ccmb,cm kcr,Reference,Center acceptance

Advertisement

Next Story