కరోనాపై సీసీఎంబీ ప్రయోగం

by vinod kumar |
కరోనాపై సీసీఎంబీ ప్రయోగం
X

దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాధి నివారణలో భాగంగా సీసీఎంబీ, ఐస్టెమ్ సంయుక్తంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మానవ ఊపిరితిత్తుల ఎపథీలయన్ కణాలను ఉపయోగించి కొవిడ్ -19 వైరస్ అణువులను, రోగ లక్షణాలకు సంబంధించిన హేతుబద్ధమైన ప్రాతిపదికలను సిద్ధం చేస్తున్నారు. సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా, ఐస్టెమ్ సీఈఓ జోగిన్ దేశాయ్ మాట్లాడుతూ,మానవుల్లో పెరిగే కరోనా వైరస్‌లను ప్రయోగశాలల్లో అభివృద్ధి చేయడం పెద్ద సాంకేతిక సవాల్‌ అని వివరించారు. ఐస్టెమ్ తయారుచేస్తున్న కణవ్యవస్థ ద్వారా ఊహించిన విధంగా వైరస్‌ను పెంచి ఔషధ పరీక్షలు, టీకాలను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు.

Tags: Telangana, Hyderabad, corona, CCMB

Advertisement

Next Story

Most Viewed