ఎమోజీలను తలపించే.. పిల్లి చేష్టలు

by Shamantha N |   ( Updated:2020-12-01 08:36:02.0  )
ఎమోజీలను తలపించే.. పిల్లి చేష్టలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘కోపం, బాధ, సంతోషం, చిరాకు, అయోమయం, వెక్కిరింపు’ ఇలా అన్ని భావాలు ‘ఎమోజీ’లుగా రూపం దాల్చుకున్నాయి. మనం చెప్పాలనుకునే మాటలను, మనస్సులోని భావాలను చాలా సులభంగా చెప్పేందుకు ఈ ఎమోజీలు ఉపయోగపడతున్న సంగతి తెలిసిందే. 1990లోనే ఎమోజీల వాడకం మొదలైనా, ఇటీవల కాలంలో సోషల్ మీడియా అధిక వినియోగంతో వీటి వాడకం విపరీతంగా పెరిగింది. తొలిగా వాతావరణ స్థితిగతులను తెలియజేసేందుకు ఎమోజీలను వాడగా, ఇప్పుడు కొన్ని వందల ఎమోజీలు.. మన మాటలను, చేతలను తెలియజేస్తున్నాయి. సాధారణంగా సెల్ఫీలు దిగేటప్పుడు మనం కూడా ఎమోజీల్లాంటి పోజులు పెడుతుంటాం. ఇది కామన్, కానీ పెర్రి అనే ట్విట్టర్ యూజర్ ‘ఎమోజీ’ల పోజుతో ఉన్న పిల్లి ఫొటోలను పెడుతూ, నెటిజన్లను ఫిదా చేస్తోంది.

పెర్రి పెడుతున్న క్యాట్ అండ్ ఎమోజీ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ‘తలకిందులుగా నిలబడటం, నాలుకతో వెక్కిరించడం, నోటికి చేయి అడ్డుపెట్టుకోవడం, రెండు చేతులతో రెండు కళ్లు మూసుకోవడం, ఆశ్చర్యంగా చూడటం’ ఇలా పెర్రి ట్విట్టర్ అకౌంట్లో ఎమోజీల భావాలను పలకించే పిల్లి ఫొటోలెన్నో ఉన్నాయి. ఆ ఫొటోలు చూస్తే మనం కూడా కాసేపు అరే భలే ఉన్నాయే! అని నవ్వుకోకుండా ఉండలేం.

Advertisement

Next Story

Most Viewed