WhatsApp యూజర్లకు గుడ్‌న్యూస్..

by Anukaran |   ( Updated:2021-09-23 06:31:53.0  )
WhatsApp యూజర్లకు గుడ్‌న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్ : గూగుల్ పే, ఫోన్ పేను సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఫేస్‌బుక్ తర్వాత అత్యధిక వినియోగదారులను కలిగియున్న వాట్సాప్ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించేందుకు కొత్తగా వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. వాట్సాప్ పే ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్న వారికి కొత్తగా క్యాష్ బ్యాక్ (Cash Back) ఆఫర్లు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి సంస్థలు కస్టమర్లకు క్యాష్ బ్యాక్, రివార్డులు ప్రకటించి ఆన్‌లైన్ లావాదేవీలు పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి యూపీఐ ద్వారా డబ్బులు పంపే యూజర్ల కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్లను తెస్తున్నట్టు ప్రకటించింది. ఒక్కో పేమెంట్ కు రూ.10 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా, ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story