- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గడప ముందు మూత్రం పోశాడని జాతీయ అధ్యక్షుడిపై కేసు
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవరితోనైనా గొడవ పడితే ఏదో విధంగా వారిపై పగ తీర్చుకోవడం సహజం. ఇటువంటి పనులు ఎక్కువగా ఆకతాయిలు చేస్తుంటారు. బైక్, కారు నుంచి గాలి తీసేయడాలు, సీట్ కవర్‌లు కోయడం, ఎవరూ లేని సమయంలో వారి ఇంటి ముందు మూత్రం పోయడం వంటివి చేస్తుంటారు. అయితే, తనతో గొడవపడ్డ జాతీయ అధ్యక్షుడు ఏకంగా డోర్ ముందు మూత్రం పోశారని ఓ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చెన్నై నంగనల్లూర్‌లో వెలుగుచూసిన ఈ వార్త అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. ఓ అపార్ట్ మెంట్‌లో ఒంటిరిగా నివాసం ఉంటున్న వృద్దురాలితో.. ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డా. సుబ్బయ్య- గొడవపడ్డారు. కారు పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య కాసేపు వాదనాలు జరిగాయి. ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్లు వెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయం తన ఇంటి డోర్ తీసిన వృద్ధురాలికి మూత్రం వాసన వచ్చింది. దీంతో డాక్టర్ సుబ్బయ్యనే తన గుమ్మం ముందు మూత్రం పోశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఏకంగా వృద్దురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో గొడవ పడ్డ ఏబీవీపీ అధ్యక్షుడు అర్ధరాత్రి తన గుమ్మం వద్దకు వచ్చి మూత్రం పోశారని కంప్లైంట్ రాసి ఇచ్చింది. సీసీ పుటేజీ పరిశీలిస్తే సుబ్బయ్య అని స్పష్టం అయినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. అయినా.. పోలీసులు మాత్రం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది.