- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ఇంటి పెద్దలదే
దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం వినూత్న ఆలోచనలకు తెరతీస్తున్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ వాయిస్ మెసేజ్ ద్వారా ప్రజలను, కుటుంబ పెద్దలు, ముఖ్యంగా మహిళలను చైతన్యం చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్లనే ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నట్టు తెలుస్తోందన్నారు. కాబట్టి వైరస్ సోకిన వ్యక్తికి, అతని కుటుంబానికి ఎవరైనా సన్నిహితంగా ఉంటే వారి వివరాలను మీ పరిధిలోని ఆశా వర్కర్లు, మెడికల్ ఆఫీసర్‌కు సమాచారం అందించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉంటున్నందున ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా బయట తిరిగినట్టు తెలిస్తే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరో 15 రోజులు లాక్‌డౌన్ పాటించాల్సి వచ్చేలా ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వెళితే తప్పనిసరిగా మాస్కులు , కళ్ళద్దాలు పెట్టుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు స్వీయ నియంత్రణ పాటించాలని కలెక్టర్ వివరించారు. కంటామినెంట్ జోన్‌లో రిస్క్ అని తెలిసినా వైద్యులు, పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని, వారి శ్రమను అర్థం చేసుకుని, ఇం టినుంచి బయటకు రావొద్దని వాయిస్ మెసేజ్‌లో కలెక్టర్ తెలిపారు. కరోనాకు మందు లేదని కాబట్టి ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా పాటించాలని, పోలీసులకు సహకరించాలని జిల్లా పాలనాధికారి ప్రజలను కోరారు.
Tags: carona, lockdown, collecter narayanareddy, voice messages to dist people