- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Supreme Court: సుప్రీం కోర్ట్ లో ఉద్యోగ అవకాశాలు.. జీతం, అర్హత వివరాలివే..!
దిశ, వెబ్‌డెస్క్: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్(Supreme Court) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 107 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.sci.gov.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 1 డిసెంబర్ 2024. దేశవ్యాప్తంగా 23 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
పోస్టు పేరు, ఖాళీలు:
- కోర్ మాస్టర్(Group-A) - 31
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్(Group-B) - 33
- పర్సనల్ అసిస్టెంట్(Group-B) - 43
విద్యార్హత:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్(WPM) ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 250 ఫీజు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 44,000 నుంచి రూ. 67,000 వరకు జీతం ఉంటుంది.