SBI: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరలివే..!

by Maddikunta Saikiran |
SBI: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరలివే..!
X

దిశ, వెబ్‌‌డెస్క్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్న 25 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(SCO) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/web/careers ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 17 డిసెంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(SCO) - 25

విద్యార్హత:

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి:

1 ఆగస్టు 2024 నాటికి 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

విద్యార్హతలు, మెరిట్ లిస్ట్, అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ముంబై, చెన్నై, కోల్‌కతా లో జాబ్ చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed