- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PGCIL Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత, జీతం తదితర వివరాలివే..!
దిశ, వెబ్‌డెస్క్: న్యూఢిల్లీ(New Delhi)లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ పవర్ గ్రిడ్ రీజియన్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 802 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.powergrid.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 19 నవంబర్ 2024. జనవరి లేదా ఫిబ్రవరి 2025లో పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
పోస్టు పేరు, ఖాళీలు:
- డిప్లొమా ట్రైనీ(Electrical) - 600
- డిప్లొమా ట్రైనీ(Civil) - 66
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ(HR) - 79
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ(F&A) - 35
- అసిస్టెంట్ ట్రైనీ(F&A) - 22
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీబీఏ, బీకాం, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
12 నవంబర్ 2024 నాటికి 27 ఏళ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, సర్టిఫికట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ. 200. ఇతర పోస్టులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
జీతం:
అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు నెలకు రూ. 21,500- రూ. 74,000. ఇతర పోస్టులకు నెలకు రూ. 24,000- రూ. 1,08,000 వరకు జీతం ఉంటుంది.