దరఖాస్తులు సరిగా అప్‌లోడ్ చేయాలి.. మెడికల్​బోర్డు సూచన

by GSrikanth |   ( Updated:2022-09-19 15:26:54.0  )
దరఖాస్తులు సరిగా అప్‌లోడ్ చేయాలి.. మెడికల్​బోర్డు సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సివిల్​అసిస్టెంట్​సర్జన్ నియామకాల దరఖాస్తులను సరిగా అప్‌లోడ్ చేయాలని మెడికల్​రిక్రూట్‌మెంట్​బోర్డు సోమవారం ఒక ప్రకటనలో సూచించింది. ప్రధానంగా ఎక్స్‌పీరియన్స్​సర్టిఫికెట్లను సక్రమంగా అప్‌లోడ్​చేయాలని పేర్కొన్నది. సరిగా చేయక పోవడంతో అభ్యర్థుల ఎంపికలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపింది. ఇప్పటికే అప్‌లోడ్ చేసిన వారు మరోసారి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ చేయాలని సూచించింది. దీనికి ఈ నెల 21 నుంచి 27 వరకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జూన్ 15న వైద్యారోగ్యశాఖలో 1326 డాక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్​విడుదల చేసింది. వీటిలో డైరెక్టర్​ఆఫ్​పబ్లిక్​హెల్త్​విభాగంలో 751, డైరెక్టర్​ఆఫ్​మెడికల్​ఎడ్యుకేషన్​పరిధిలో 357, తెలంగాణ వైద్య విధాన పరిషత్​పరిధిలో 211, ఐపీఎంలో 7 డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలనుకున్నది. తర్వాత డైరెక్టర్​ఆఫ్​మెడికల్​ఎడ్యుకేషన్​విభాగంలోని 357 ట్యూటర్​పోస్టులను తర్వాత భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం రివైజ్డ్​నోటిఫికేషన్​ఇచ్చింది. ప్రస్తుతం 969 పోస్టుల భర్తీ ప్రాసెస్​సాగుతున్నది.

జాతీయ సంస్కృత వర్సిటీలో యూజీ కోర్సులు

Advertisement

Next Story