కూకట్‌పల్లిలో కారు బీభత్సం

by Sumithra |
కూకట్‌పల్లిలో కారు బీభత్సం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో కారు బీభత్సం స‌ృష్టించింది. హైటెక్‌సిటీ రోడ్‌లో ఓ కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరికి ప్రాణపాయం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రణీత్, మరో యువతి ప్రయాణిస్తున్నారు. మాదాపూర్‌లో పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story