- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి
దిశ, శేరిలింగంపల్లి : అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఒకరి ప్రాణాలను బలితీసుకోగా, మరో వ్యక్తిని గాయాల పాలు చేసింది. మాదాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. పార్వతీ నగర్ ఆటోస్టాండ్ వైపు నుంచి శనివారం సాయంత్రం పార్వతీ నగర్ సిగ్నల్ వైపు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి అతివేగంగా స్విఫ్ట్ కారు (టీస్ 09 ఈఎల్ 9696)ను డ్రైవ్ చేస్తూ ఇంద్ర విల్లాస్ మూల మలుపు వద్ద రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని ఇద్దరు కూలీలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
అయితే, ఆ ఇద్దరు కూలీలను కారు నడిపిన వ్యక్తి ఆటోలో మెడికవర్ హాస్పిటల్‌కు తరలించి తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నరేందర్ రెడ్డి బంజారాహిల్స్‌లో ఎలక్ట్రిసిటీ డీఈగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన నరేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు, మృతుని వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.