ఎంఎస్ఎంఈల అభివృద్దికి ఎస్‌బీఐతో క్యాప్రి గ్లోబల్ భాగస్వామ్యం!

by Harish |   ( Updated:2021-11-29 05:23:13.0  )
sbi
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించేందుకు ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ క్యాప్రి గ్లోబల్ కేపిటల్, ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నామని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ ఒప్పందం ద్వారా క్యాప్రి గ్లోబల్, ఎస్‌బీఐలు డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా 100కి పైగా టచ్‌పాయింట్ల వద్ద ఎంఎస్ఎంఈ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ఉన్నట్టు ఇరు సంస్థలు ప్రకటించాయి.

ప్రాధాన్య రంగానికి సంయుక్త రుణాలు ఇవ్వడం కోసం గతేడాది నవంబరులో ఆర్‌బీఐ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరిందని, ఎస్‌బీఐ సహకారంతో ఎంఎస్ఎంఈలకు మెరుగైన వడ్డీ రేటుతో రుణాలను ఇస్తుందని క్యాప్రి గ్లోబల్ కేపిటల్ తెలిపింది. ‘ఎంఎస్ఎంఈల ఆర్థిక పరిష్కారాలను అందించేందుకు క్యాప్రి, ఎస్‌బీఐతో కలిసి పనిచేయనుంది. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ పరిధి, విశ్వాసం ద్వారా తమ నెట్‌వర్క్ మరింత మెరుగవుతుందనే నమ్మకం ఉందని’ క్యాప్రి గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ శర్మ చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధికి బ్యాంకులు వెన్నెముక అని, సుస్థిర వృద్ధికి బ్యాంకింగ్ రంగం ఎంఎస్ఎంఈ రుణాలను వేగవంతం చేయాలని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed