- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైళ్ల ద్వారా డబ్బులు.. హుజూరాబాద్‌లో నయా ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రలోభాలకు రైల్వే మార్గం కీలకంగా మారింది. గతంలో ఎన్నికలకు ఎలాగోలా నగదు, వస్తువులు పంపిణీ చేసే పార్టీల అభ్యర్థులు ఇప్పుడు హుజురాబాద్‌పై రాష్ట్రం, కేంద్రస్థాయి అధికారుల నిఘా ఉండటంతో రూట్ మార్చారు. వీరికి రైల్వే మార్గం అనుకూలంగా మారింది. జమ్మికుంటకు ఇటీవల బల్క్ పార్శిళ్లు కూడా ఎక్కువగా పెరిగినట్లు రైల్వే అధికారులు గుర్తించారు.
దృష్టి పెట్టండి
వాస్తవానికి రైల్వేలో సామాగ్రి, డబ్బులు తీసుకెళ్లడం కొంత సులభంగానే ఉంటోంది. తనిఖీలు కూడా తక్కువగా ఉంటాయి. రైల్వే స్టేషన్లలో టికెట్లను అడిగే అధికారులు.. బ్యాగుల్లో ఎంత నగదు, ఎలాంటి వస్తువులైనా తీసుకెళ్లినా పట్టించుకోరు. అందుకే ఇప్పుడు పార్టీ నేతలు జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లను అడ్డాగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్టేషన్లలో రాజకీయ నేతల సందడి కూడా పెరిగింది. దీంతో రైల్వే కేంద్రంగా ప్రలోభాలు జరుగుతున్నట్లు ఈసీ సైతం గుర్తించినట్లు తెలుస్తోంది.
ప్రలోభాలకు రైల్వే మార్గం రాచమార్గంగా ఉండటంతో ఈసీ నుంచి కూడా రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సికింద్రాబాద్ నుంచి జమ్మికుంట వరకు రైల్వే పోలీసుల తనిఖీలు పెంచాలని ఈ సందర్భంగా ఈసీ రిపోర్ట్ ఇచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. దీనిపై జీఆర్పీఎఫ్ పోలీసులతో ప్రత్యేకంగా గురువారం సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పుతున్నారు.