- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయండి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న దృష్ట్యా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి ప్రజల ప్రాణాలను బలి తీసుకోవద్దని, వెంటనే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కమిటీ మంగళవారం ఎస్ఈసీకి లేఖ రాసింది. మే 1 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కమిటీ పేర్కొంది. రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, ఇతర పార్టీల ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకుండానే ఎన్నికల సంఘం ఏకపక్షంగా నోటిఫికేషన్ విడుదల చేసిందని అభిప్రాయపడింది.
ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. హైకోర్టు ప్రశ్నించినందుకే ప్రభుత్వం వెంటనే నైట్ కర్ఫ్యూ విధించిందని, ఎన్నికల ప్రక్రియను కూడా నిలిపివేయాలని కోరారు. తద్వారా ప్రజలు కరోనాకి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుందని సూచించారు.