- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి బస్తాపై క్యూ ఆర్ కోడ్..
దిశ, వెబ్ డెస్క్: మెరుగైన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కన్నబాబు అన్నారు. ఇసుక విధానం ఖరారుపై ప్రజల సలహాలను స్వీకరించామని ఆయన తెలిపారు. ఇసుక తవ్వకాల్లో మొదట ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థలు ముందుకు రాకపోతే టెండర్లను పిలుస్తామని తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో కూడా ఇసుక బుక్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సొంత వాహనాల్లో కూడా వినియోగదారులు ఇసుకను తీసుకెళ్లొచ్చని అన్నారు. నేరుగా ఇసుక రీచ్ నుంచే ఇసుకను తీసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ ధరల కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇసుక ధరలపై ప్రజలు ఎస్ఈబీకి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఎస్ఈబీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఈబీకి ఎర్రచందనం అనుసంధానం చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఎస్ఈబీ పరిధిలోకి గుట్కా, జూదం,మత్తు పదార్థాలను తీసుకు రానున్నట్టు తెలిపారు. జగనన్న తోడు పథకానికి వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా ఇప్పటికే లబ్దిదారులను గుర్తించామని ఆయన చెప్పారు. జనవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ప్రతీ బియ్యం బస్తాపై క్యూ ఆర్ కోడ్ ముంద్రించనున్నట్టు ఆయన తెలిపారు. బియ్యం తరలించే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయనున్నట్టు ఆయన తెలిపారు. పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేస్తామని ఆయని అన్నారు. గ్రామాల్లో బల్క్ చిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.