- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPI Lite: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం..యూపీఐ లైట్, వ్యాలెట్ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు
దిశ, వెబ్‌డెస్క్:డిజిటల్ పేమెంట్స్(Digital payments)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్(UPI Lite), వ్యాలెట్(Wallet) ట్రాన్సాక్షన్ లిమిట్(Transaction limit)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ(Monetary Policy Committee) సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్(RBI Governor) శక్తికాంత దాస్(Shaktikanta Das) ఓ ప్రకటనలో తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ సేవలను మరింత ప్రోత్సహించేలా యూపీఐ లైట్ పరిమితిని ప్రస్తుతమున్న రూ.500 నుంచి రూ.1,000కి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.అలాగే ప్రతి లావాదేవికి యూపీఐ 123పే లిమిట్‌ను కూడా రూ.5000 నుంచి రూ.10,000 వరకు పెంచారు. కాగా యూపీఐ లైట్ ద్వారా ఎలాంటి పిన్(Pin) ఎంటర్ చేయకుండానే చిన్నమొత్తంలో లావాదేవీలు(Small Transactions) చేసుకోవచ్చు. యూపీఐ లైట్ వ్యాలెట్ సర్వీసులు పొందాలంటే యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఉండాలి.ఇక యూపీఐ 123పే అనేది ఫీచర్ ఫోన్లు వాడే వారికి ఉపయోగపడేది. ఫీచర్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ లేకున్నా మీరు యూపీఏ 123 పే సేవలు వాడుకోవచ్చు.