- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలన్ మస్క్‌పై దావా వేసిన ట్విట్టర్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు!
వాషింగ్టన్: గతేడాది ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ తొలగించిన ముగ్గురు టాప్ ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్‌లు తాజాగా కోర్టును ఆశ్రయించారు.ఎలన్ మస్క్ నుంచి తమకు రావాల్సిన పరిహారం రావాలని, ఆ మొత్తాలను చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దావా వేశారు. దావా వేసిన వారిలో ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, మాజీ చీఫ్ లీగల్ అండ్ ఫైనాన్సియల్ ఆఫీసర్లు విజయ గద్దె, నెడ్ సెగల్ ఉన్నారు. తాము ట్విట్టర్‌లో ఉన్న సమయంలో వివిధ చట్టపరమైన విచారణలతో పాటు న్యాయ సంబంధ ప్రక్రియల్లో పాల్గొన్నామని, అందుకోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సంస్థలు తిరిగి చెల్లించాల్సి ఉందని వారి పిటిషన్‌లో తెలిపారు.
పరిహారం కింద సుమారు 1 మిలియన్ డాలర్ల రావాలని పేర్కొన్నారు. గతంలో యూఎస్ సెక్యూరిటీస్, జస్టిస్ డిపార్ట్‌మెంట్ సహా పలు ప్రభుత్వ సంబంధిత విచారణల్లో పాల్గొన్నామని ఎగ్జిక్యూటివ్‌లు వివరించారు. కాగా, గతేడాది ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత అక్టోబర్‌లో పరాగ్ అగర్వాల్, విజయ గద్దె, నెడ్ సెగల్‌లను తొలగించిన సంగతి తెలిసిందే.