- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
3 నెలల్లో 7 శాతం తగ్గిన అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య
దిశ, బిజినెస్ బ్యూరో: గత మూడు నెలల్లో 9 ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 7 శాతం పడిపోయి దాదాపు 4.81 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది. ప్రధాన నగరాల్లో 2023 డిసెంబర్ నాటికి అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 5,18,868 యూనిట్లుగా కాగా, ఈ ఏడాది మార్చి నాటికి చాలా వరకు తగ్గింది. ముంబై, నవీ ముంబై, హైదరాబాద్, థానే, ఢిల్లీ-NCR (ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్), బెంగళూరు, పూణే, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల అమ్మకాల్లో గణనీయమైన తేడా కనిపించిందని రియల్ ఎస్టేట్ సంస్థ పేర్కొంది.
2024 జనవరి-మార్చి కాలంలో, 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 1,44,656 యూనిట్లుగా ఉండగా, కొత్త లాంచ్‌లు 1,05,134 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో అమ్ముడుపోని స్టాక్‌లు తగ్గుముఖం పట్టాయి. పూణేలో డిసెంబర్ 2023 చివరినాటికి అమ్ముడుపోని ఇళ్లు 75,521 యూనిట్లు కాగా ఇది ఈ నెలాఖరు నాటికి 13 శాతం పడిపోయి 65,788 యూనిట్లకు తగ్గింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కూడా అమ్ముడుపోని ఇళ్లు 12 శాతం తగ్గి 31,602 యూనిట్ల నుంచి 27,959 యూనిట్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్లు 4 శాతం తగ్గి 1,14,861 యూనిట్ల నుంచి 1,10,425 కు చేరుకున్నాయి. ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు సమీర్ జసుజా మాట్లాడుతూ, ఇళ్ల అమ్మకాలు, కొత్త లాంచ్‌లను అధిగమించాయని, ఇది మార్కెట్‌కు సానుకూల అంశం. అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని అన్నారు.