- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలవరాన్ని సర్వనాశనం చేయబోతున్నారు: అంబటి రాంబాబు సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)ను సర్వనాశనం చేయబోతున్నారని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu) సంచలన ఆరోపణలు చేశారు. పోలవరాన్ని కేవలం బ్యారేజీగా చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 2,348 కోట్ల నిధులు ఏం చేశారో కూటమి నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం కుంటుపడానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) చేసిన తప్పిదమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను ఎవరు చదివినా చంద్రబాబు తప్పిదాలే కనబడతాయన్నారు. 194.6 టీఎంసీల నిల్వతో పోలవరం ప్రాజెక్టు ఫలితాలు అందుతాయని తెలిపారు. 41.15 అడుగు ఎత్తు వరకూ నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. పోలవరంపై మంత్రి నిమ్మల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలను ప్రజలు ఉపేక్షించరని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్యాకేజీకి ఓకే చెప్పి ప్రత్యేక హోదానూ చంద్రబాబు సర్వనాశనం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.