- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుసగా ఎనిమిదో రోజు లాభాలు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో మెరుగైన త్రైమాసిక ఫలితాలు ఉంటాయనే సంకేతాల మధ్య సూచీలు వరుసగా ఎనిమిదో రోజు లాభపడ్డాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించడానికి ముందు ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ షేర్లు పుంజుకోవడం, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో కొనుగోళ్లు జరగడం వంటి పరిణామాలు మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయి. వీటికి తోడు ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి డేటా విడుదల కానుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు పుంజుకున్నాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 235.05 పాయింట్లు పెరిగి 60,392 వద్ద, నిఫ్టీ 90.10 పాయింట్లు లాభపడి 17,812 వద్ద ఉంది. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ, అల్ట్రా సిమెంట్, ఎస్‌బీఐ, హిందూస్తాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.08 వద్ద ఉంది.
Also Read..