- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 80,000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్..!
దిశ, వెబ్డెస్క్: దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడంతో మన బెంచ్ మార్క్ సూచీలు రాణించాయి. ముఖ్యంగా ఈ రోజు రిలయన్స్(Reliance), ఇన్ఫోసిస్(Infosys) షేర్లు సూచీలకు అండగా నిలిచాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 79,743.87 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై కాసేపటికే కోలుకొని లాభాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 79,308.95 వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 445.29 పాయింట్ల లాభంతో 80,248.08 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) 144.95 పాయింట్లు పెరిగి 24,276.05 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.68 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.71కి చేరుకుంది.
లాభాల్లో ముగిసిన షేర్లు : జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్
నష్టాల్లో ముగిసిన షేర్లు : ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్