సెన్సెక్స్ @74000

by S Gopi |
సెన్సెక్స్ @74000
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డులను నమోదు చేశాయి. కీలక బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. బుధవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు మిడ్-సెషన్ వరకు నష్టాల్లోనే కదలాడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్దగా మద్దతు లేకపోయినప్పటికీ దేశీయంగా కీలక ప్రైవేట్ రంగ బ్యాంకుల, ఐటీ షేర్లలో కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి 74,000 మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 22,497 వద్ద కొత్త గరిష్ఠాలను తాకింది. మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు ఉన్నప్పటికీ, లార్జ్ క్యాప్ కంపెనీల షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో ర్యాలీ ఊపందుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 408.86 పాయింట్లు పుంజుకుని 74,085 వద్ద, నిఫ్టీ 117.75 పాయింట్లు ఎగసి 22,474 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీల షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. ఆల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకి, టాటా మోటార్స్, టాటా స్టీల్ స్టాక్ష్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.86 వద్ద ఉంది.


సెన్సెక్స్ మైలురాళ్లు..

మైలురాయి తేదీ

1,000 జూలై 25, 1990

10,000 ఫిబ్రవరి 7, 2006

20,000 డిసెంబరు 11, 2007

30,000 ఏప్రిల్‌ 26, 2017

40,000 జూన్‌ 3, 2019

50,000 ఫిబ్రవరి 3, 2021

60,000 సెప్టెంబరు 24, 2021

70,000 డిసెంబరు 11, 2023

71,000 డిసెంబర్ 15,2023

72,000 డిసెంబర్ 27, 2023

73,000 జనవరి 15, 2024

74,000 మార్చి 06, 2024

Advertisement

Next Story

Most Viewed