- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mandakrishna:హోం మంత్రి పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. మనసులో పెట్టుకుంటామన్న మందకృష్ణ
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిన్న(సోమవారం) పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan) పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల(law and order) స్థితిగతులపై పవన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మారినా కొందరు పోలీసుల తీరు మారలేదని, రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. లా అండ్ ఆర్డర్ విషయం చాలా కీలకమని, ఈ విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తించాలన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వెనుకాడబోనని పవన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హోంమంత్రిని(Home Minister) ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హోంమంత్రి అనిత(Home Minister Anitha) పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవమానపరిచేలా ఉన్నాయని మందకృష్ణ మాదిగ అన్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి వర్గంలో మాట్లాడుకోవాలి కానీ ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నారు. హోంమంత్రి దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. మేం దీన్ని మనసులో పెట్టుకుంటాం అని మందకృష్ణ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ దళితులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.