person died : రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
person died : రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
X

దిశ మధిర : గుర్తుతెలియని రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తు తెలియని యువకుడు మరణించాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఖమ్మం జీఆర్పీ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం మధిర, మోటమర్రి రైల్వేస్టేషన్ల మధ్యన గుర్తు తెలియని సుమారు 25 సంవత్సరాల వయసు గల యువకుడు మరణించినట్లు, అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడు మెరూన్ రంగు షర్టు , నీలి రంగు జీన్స్ పాయింటు ధరించి ఉన్నాడు. ఆ వ్యక్తి శవాన్ని గుర్తించేందుకు మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఎస్సై భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిస్తే 8712658589, 8712658607 ఫోన్​ నంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story