- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Murder: భార్య, ముగ్గురు పిల్లల కాల్చివేత.. యూపీలో దారుణం
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలను కాల్చి చంపాడు. అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసిలోని భైదానీ ప్రాంతానికి చెందిన రాజేంద్ర గుప్తా(45) అనే వ్యక్తి 1997లో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. ఇటీవలే బెయిల్ పై విడుదలై కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో నిద్రిస్తున్న భార్య నీతూ గుప్తా (45), వారి కుమారులు నవేంద్ర (25), సుబేంద్ర (15), కుమార్తె గౌరంగి (16)ని కాల్చి చంపాడు. అనంతరం ఇంటి నుంచి వెళ్లి పోయిన రాజేంద్ర నగరంలోని రోహనియా ప్రాంతంలో తనకు తానే కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఓ సమస్యపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గుప్తా తల్లి పోలీసులకు తెలిపింది. నిందితుడు గతంలోనూ పలు హత్యలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.