- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rahul Gandhi : కులగణనపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్ : కులగణన(Caste Census)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు బయటకు రావొద్దు అనుకునేవారు మాత్రమే కులగణనకు అడ్డు పడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు హైదరాబాద్(Hyderabad) లో కులగణన సర్వేపై అభిప్రాయ సేకరణ సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కులవివక్ష ఉందనేది అక్షరాల నిజం అని అన్నారు. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కంటే భారత్ లోనే కుల వివక్ష ఎక్కువగా ఉందని ప్రపంచ నిపుణులు చెబుతున్నారని అన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఇదివరకే చెప్పామని, దానిని నెరవేర్చుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) చేపడుతున్న ఈ సర్వేపై తాను ఎంతో సంతోషిస్తున్నానని.. కులగణన విషయంలో ఈ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ కానుందని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పేర్కొన్నారు.